Posts

Showing posts from June, 2024

వాడినేది అడిగేది... వాడినేది కోరేది...

అల్ప మనుజుడు వాడినేది అడిగేది నవమి నాటి నష్ట జాతకుడు వాడినేది కోరేది... కోరికల చెరలోనున్న కైకేయి మాటలకు కానలకు పోయినవాడినేది అడిగేది...  తరుణి అని ఘోర తాటకిని చంప వెనుకంజ వేసినవాడినేది కోరేది... ||వాడినేది అడిగేది|| విశృంఖల వాలికి వరములిచ్చి వరియించినవాడినేది అడిగేది.  తాగుబోతు మాటలకు తనను నమ్మిన ఆలినీ విడిచినవాడినేది కోరేది...||వాడినేది అడిగేది|| వర గర్వమున విర్రవీగిన రావణుడికి మోక్షమిచ్చినవాడినేది అడిగేది... జానకిని రక్షింప జూసిన జటాయువుని రక్షించలేనివాడినేది కోరేది... ||వాడినేది అడిగేది|| దీనిని "నిందాస్తుతి" అంటారు. ఇదేమి కొత్త ప్రక్రియ కాదు. రామదాసు కీర్తనల్లో "ఇక్ష్వాకుకుల తిలకా..." అనే పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన "ఆది భిక్షువు వాడినేది అడిగేది..." పాట ఇదే కోవలోకి వస్తాయి.  వాళ్లంతా మహానుభావులు. వాళ్లంత పరిజ్ఞానం లేకపోయినా నాకు తెలిసిన రామాయణంలోని కొన్ని ఘటనల ఆధారంగా రాసింది ఈ నిందాస్తుతి.  ఈ నిందా స్తుతి ఒక విచిత్రమైన ప్రక్రియ. పైకి నిందిస్తున్నట్టు ఉన్నా, నిందించే సమయంలో కూడా దైవ నామ స్మరణ చేసుకోవడం దీని లక్షణం. ఇక్కడ దేవుడ్ని నింది...