మహాభారతంలోని గౌతమ - ఇంద్ర సంవాదం
ఆదిత్య శివ శంకర్ కలకొండ గారు ట్విటర్లో సంకలన చేసిన మహాభారతంలోని ఒక కథ... #మహాభారతంలోని ఈకథ చాలా విలువైనది, కాస్త పెద్దదైనా ఓపికగా చదివితే ఆంతర్యం అర్థమవుతుంది.. ఒకసారి #గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని — ఆదిత్య శివశంకర కలకొండ (@janakishivasha2) January 30, 2023 మహాభారతంలోని ఈకథ చాలా విలువైనది, కాస్త పెద్దదైనా ఓపికగా చదివితే ఆంతర్యం అర్థమవుతుంది.. ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నాసొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు.